తెలంగాణలో 5 రోజులపాటు డాక్టర్ల సమ్మెబాట

Doctors in Telangana will go on strike
Highlights

నిలిచిపోనున్న వైద్య సేవలు

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ డాక్టర్ల వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయం పై తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సర్కారు నిర్ణయం పై డాక్టర్స్ అసోసియేషన్ పోరుబాట పట్టింది.

వయో పరిమితి పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదు రోజులపాటు విధులు బహిష్కరించాలని టిజిడిఎ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. తీవ్ర వాగ్వాదం జరగడంతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో హోరెత్తింది. తెలంగాణ సర్కారు డాక్టర్ల వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకోవడం ఈ వివాదం చోటు చేసుకుంది.

తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేపటినుంచి 5రోజులపాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. మరోవైపు డాక్టర్లు పోరును ఉధృతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. రేపు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు  ప్రభుత్వ డాక్టర్లు. సర్కారు నిర్ణయం డాక్టర్లను రెండు వర్గాలు నిట్టనిలువునా చీల్చిందని చర్చ మొదలైంది. వయో పరిమితి పెంపుదల వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు అంటున్నారు. తక్షణమే సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

loader