Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం:డాక్టర్ కుటుంబానికే చుక్కలు, సెల్ఫీ వీడియో

కరోనా  రోగులకు చికిత్స  విషయంలో  ప్రభుత్వం నిర్ధారించిన కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓ మహిళా డాక్టర్  సెల్ఫీ వీడియోను మీడియాకు పంపింది. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ వీడియోను ప్రసారం చేసింది.

Doctor vijaya releases selfie video over private hospital treatment
Author
Hyderabad, First Published Jul 8, 2020, 12:29 PM IST


హైదరాబాద్: కరోనా  రోగులకు చికిత్స  విషయంలో  ప్రభుత్వం నిర్ధారించిన కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓ మహిళా డాక్టర్  సెల్ఫీ వీడియోను మీడియాకు పంపింది. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఈ వీడియోను ప్రసారం చేసింది.

హైద్రాబాద్ పట్టణంలోని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ విజయ కేసరి, ఆమె తండ్రి యాదగిరి 14 రోజుల క్రితం చేరింది. అనారోగ్య కారణాలతో చేరారు. అయితే వారిద్దరికి కూడ కరోనా ఉందని ఆసుపత్రి వైద్యం చెప్పిందని డాక్టర్ విజయ కేసరి ఆ వీడియోలో ఆరోపించారు.

also read:ఒక్క రోజుకే రూ.1.50 లక్షల బిల్లు: ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ నిర్భంధం,సెల్ఫీ వీడియో

కరోనా చికిత్స విషయంలో తమకు ఎలాంటి చికిత్స నిర్వహించలేదని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంపై డాక్టర్ విజయ విమర్శించారు. ఆక్సిజన్, వెంటిలేటర్ ఉపయోగించినట్టుగా  బిల్లు చేశారని ఆమె తెలిపారు. ఈ విషయమై ప్రశ్నిస్తే మరో రకంగా బిల్లులు సృష్టించారని ఆమె ఆరోపించారు.

తమకు ట్రీట్‌మెంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా, నిపుణులైన డాక్టర్లను పిలిపించి ట్రీట్ మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు బిల్లులు వేశారన్నారు. ఈ విషయమై తాను ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ విషయాలను ప్రశ్నిస్తే తమను వెంటనే డిశ్చార్జ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు న్యాయం చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు ఫోన్ చేసినట్టుగా ఆమె ఆ వీడియోలో తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ డాక్టర్ సుల్తానాను చాదర్ ఘాట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం నిర్భందించింది. ఈ విషయమై ఆమె సెల్ఫీ వీడియోను  ఆమె ఈ నెల 5వ తేదీన విడుదల చేసింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకొన్నారు.ప్రైవేట్ ఆసుపత్రి నుండి డాక్టర్ సుల్తానాను అదే రోజున నిమ్స్ కు తరలించారు.

ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 7వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.   ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మరణించాడు. ఆసుపత్రిలోకి చికిత్స కోసం  రూ. 12 లక్షలు బిల్లు వేశారు. రూ. 6 లక్షలు చెల్లించినట్టుగా బాధిత కుటుంబం ఆరోపించింది. మిగిలిన డబ్బులు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

కరోనా రోగులకు చికిత్స విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయడంపై హైకోర్టు ఈ నెల 7వ  తేదీన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటె ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios