Asianet News TeluguAsianet News Telugu

ఆఫీస్‌లో పార్టీ , మద్యం తాగించి వైశాలి ఇంటికి, నవీన్ రెడ్డి పక్కా స్కెచ్.. వెలుగులోకి కీలక విషయాలు

ఆదిభట్లలో డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసిన కేసులో మొత్తం 31 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అయితే కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

doctor vaishali kidnap case updates
Author
First Published Dec 10, 2022, 3:51 PM IST

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన వైశాలి అనే డెంటల్ డాక్టర్ కిడ్నాప్ అయిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో దాదాపు 100 మంది రౌడీలతో మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి ఆ యువతిని కిడ్నాప్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే డాక్టర్ వైశాలి ఆచూకీని సంపాదించి, కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. అయితే ఈ కేసుకు సంబంధంచి ఇరు కుటుంబాల వాదనలు ఒక్కోలా వున్నాయి. 

మరోవైపు కేసు దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డాక్టర్ వైశాలి రెడ్డి ఇంటి సమీపంలోని పలు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. యువతి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు కర్రలు, కత్తులతో దాడికి దిగారు. ఇంట్లో వున్న ఫర్నిచర్, సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారు. దాడికి ముందు జరిగిన పలు విషయాలను పోలీసులు రాబడుతున్నారు. 

ALso REad:ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు .. 31 మంది అరెస్ట్ , పరారీలో ఆరుగురు : రాచకొండ సీపీ

యువతిని అపహరించాలని ముందే ప్లాన్ చేసిన నవీన్ రెడ్డి.. తన మిత్రులు, తన వద్ద పనిచేసే సిబ్బందిని కార్యాలయానికి రప్పించాడు. అక్కడ మద్యం పార్టీ ఏర్పాటు చేసి.. పీకలదాకా తాగించాడు. అనంతరం వారందరినీ వెంటబెట్టుకుని కార్లలో వైశాలి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె ఇంటిపై దాడి చేయించి.. యువతిని ఎత్తుకునిపోయాడు. ఘటన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు లైవ్ ట్రాకింగ్ ద్వారా వారిని ఆంధ్రా- తెలంగాణ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 31 మందిని అదుపులోకి తీసుకోగా... ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఇంకా పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై హత్యాయత్నం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios