Asianet News TeluguAsianet News Telugu

మహిళా రోగి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ వెకిలి చేష్టలు..కీచక డాక్టర్ కు పదేళ్ల జైలు, జరిమానా..

వైద్యం కోసం వచ్చిన రోగితో ఓ డాక్టర్ నీచంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ, అడిగితే చికిత్సలో భాగం అంటూ నమ్మించాడు. చివరికి ఆమెకు విషయం అర్థం కావడంతో.. కేసు పెట్టింది. పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

doctor sentenced ten years for molestation woman patiant in hyderabad
Author
Hyderabad, First Published Aug 10, 2022, 2:02 PM IST

హైదరాబాద్ :  ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుడే కామంతో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించాడు. చికిత్సకోసం ఆసుపత్రికి వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కామాంధుడి నేరం రుజువు కావడంతో ధర్మాసనం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లో ఆరేళ్ల క్రితం చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిపై పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వైద్యుడు. లైంగిక వేధింపుల ఆరోపణలపై నాంపల్లి కోర్టు మంగళవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఊపిరితిత్తుల సమస్యతో 2016 మే 13న హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హాస్పిటల్ కి వెళ్ళింది. ఆమెను పరీక్షించిన డాక్టర్  మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని భాస్కర చెస్ట్ క్లినిక్ కు రెఫర్ చేశారు. ఆ తర్వాత ఆమె ఆ ఆసుపత్రికి వెళ్ళింది. ఈ క్రమంలో డాక్టర్ విజయ భాస్కర్ వైద్య పరీక్షల పేరుతో గదిలోనికి తీసుకెళ్లి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.  ఆమె ప్రైవేట్ పార్ట్ లను తాకుతూ, వేధింపులకు పాల్పడ్డాడు. 

ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..

ఇదేమిటని మహిళ ప్రశ్నించగా వైద్యపరీక్షల్లో ఇది భాగమేనని అంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలు మందులు తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. అక్కడ మరోసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య తలెత్తడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చింది. మళ్లీ అదే ఆసుపత్రికి  వెళ్ళింది. నిందితుడైన వైద్యుడిని సంప్రదించింది. చెకింగ్ సమయంలో డాక్టర్ మళ్ళీ ఆమెతో అలాగే అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలికి అతని దుర్బుద్ధి అర్థమయింది.  

ఆ తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి వైద్యుడిపై గొడవకు దిగింది. అనంతరం తల్లితో కలిసి గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది.డాక్టర్ పై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. డాక్టర్ బాగోతం నిజమని తేలడంతో విజయ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన నాంపల్లి స్టేషన్ సబ్ కోర్టు జడ్జి కే కవిత నిందితుడికి 10 సంవత్సరాల జైలుశిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios