ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మధులిక ఆరోగ్యం పై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శస్త్ర చికిత్సల అనంతరం మధులిక ఆరోగ్యం మెరుగుపడిందని వారు తెలిపారు. 7గంటల పాటు శస్త్ర చికిత్స చేయడంతో కొంత ఫలితం కనపడింది. మధులిక కళ్లు తెరచి చూసినట్లు వైద్యులు తెలిపారు. ఎదుటివారు మాట్లాడే మాటలకు రెస్పాండ్ అవుతోందని చెప్పారు.

అయితే.. మరో 48గంటలపాటు ఆమె వెంటిలేటర్ పైనే ఉండాల్సి వస్తుందని సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు. సుమారు ఏడు గంటల పాటు ఐదుగురు సభ్యుల వైద్య బృందం నాలుగు సర్జరీల చేసినట్లు ఆయన తెలిపారు. సర్జరీల తర్వాత మధులిక పూర్తిగా కోలుకుందని.. డాక్టర్లు అడిగినదానికి సైగలు చేస్తుందన్నారు.

                               "

బ్రెయిన్ పై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశామని..ప్రస్తుతము మధులిక ఆరోగ్యము కుదుట పడిందన్నారు. అయినప్పటికీ..ఇంకా 48 గంటల పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా నే ఉంటుందన్నారు. ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందన్నారు.  ఇప్పటివరకు 28 యూనిట్లు రక్తాన్ని ఎక్కించామని చెప్పారు,

4 సర్జరీ చేశారు కాబట్టి ఆమె పూర్తిగా కోలుకోవాలంటే సమయం పడుతుందన్నారు. మధులిక ఇంకా వెంటిలేటర్ పైనే ఉందని.. రేపు మధ్యాహ్నం వరకు ఆమెను వెంటిలేటర్పైనే ఉంచుతామన్నారు. వెంటిలేటర్ తొలగిస్తే ఆమె మాట్లాడే అవకాశం కనబడుతోందన్నారు. ఆమె శరీరంలో ఎముకలు విరిగిన చోటల్లా సరిచేశామని చెప్పారు.