Asianet News TeluguAsianet News Telugu

ఒంటిమీద సరైన బట్టలు లేక, గాయాలతో యువతి.. ఔదార్యం చూపించిన డాక్టర్ !!

తల్లిదండ్రులు లేరు. అయినవాళ్లెవరో కూడా తెలీదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని పలు రోడ్లపై తిరుగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఓ యువతి(25)ని అక్కడి స్థానికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. 

doctor jalaja veronica helped to young woman in hyderabad - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 10:30 AM IST

తల్లిదండ్రులు లేరు. అయినవాళ్లెవరో కూడా తెలీదు. కొద్దిరోజుల క్రితం నగరంలోని పలు రోడ్లపై తిరుగుతూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో.. ఓ యువతి(25)ని అక్కడి స్థానికులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. 

ఆ తర్వాత ఉస్మానియా వైద్యులు కింగ్ కోఠి హాస్పిటల్ కు పంపారు. ఈ నెల 12న యువతిని కింగ్ కోఠి హాస్పిటక్ కు తీసుకురాగా, ఒంటిమీద గాయాలు, ఒంటిమీద బట్టలు కూడా సరిగ్గా లేవు. ఆమె వద్దకు వెళ్లాలంటేనే సిబ్బంది హడలెత్తారు.

లైంగికంగా వాడుకుని, రూ.37 లక్షలతో పరారీ.. టెక్కీ ఘరానా మోసం.. !!...

ఓ పక్క కోవిడ్ వార్డులోని బెడ్ మీద పడుకోబెడితే అక్కడున్న వారు ఇక్కడ వద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యువతిని అక్కున చేర్చుకున్న ఆస్పత్రి సూరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా తన సిబ్బంది సాయంతో యువతికి వైద్యం అందించి శుభ్రంగా తీర్చిదిద్దారు. 

ఆ తరువాత ఆమెకు రెండుసార్లు కోవిడ్ టెస్టులు చేయగా, నెగిటివ్ వచ్చింది. యువతికి ఎవరూ లేకపోవడంతో ఆమె స్వచ్ఛంద సంస్థల వారకి అప్పగించే యత్నంలో డాక్టర్ జలజ వెరోనికా ఉన్నారు.

అభాగ్యురాలికి అండగా నిలిచిన డాక్టర్ జలజ వెరోనికా, సిబ్బంది, కోవిడ్ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లిఖార్జున్ తదితరులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios