ఇది వైద్యమా: డాక్టర్ బాలుడి కాళ్లు విరిచేశాడు

Doctor breaks boy's legs at Ramanthapur
Highlights

రాష్ట్ర రాజధాని రామంతపూర్ లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. 

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని రామంతపూర్ లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. రెండున్నర ఏళ్ల వయస్సు గల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ వైద్యుడు కిరణ్ కుమార్ అతని కాళ్లు విరిచేశాడు.

డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాళ్లు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత కూడా అతను నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాళ్లు విరిచేయడంపై నిలదీయగా ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పాడు. 

వైద్యుడిపై ఫిర్యాదు చేసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాలుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాళ్లు విరగడంతో తీవ్రమైన నొప్పులతో నడవలేని స్థితిలో బాలుడు ఉన్నాడు. 

ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

loader