తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పై మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ తిట్ల వర్షం కురిపించారు. ఆమె కాంగ్రెస్ సహచర ఎమ్మెల్యే ఉత్తం పద్మావతిరెడ్డితో కలిసి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. డికె అరుణ మాటలు ఇవి ఒకసారి చదవండి....

చీరల నాణ్యత గురించి మాట్లాడకుండా.. కాంగ్రెస్ పై కేటీఆర్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నిరసనలు చేయించిందని కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడారు. బతకమ్మ చీరల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటే..  ప్రతి పక్షాలు ప్రశ్నించ కూడదా..? ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంటే మాట్లాడకూడదా? అయినా చీరల గురించి కేటీఆర్ కు ఏమి తెలుసు ? మహిళలకు నాసిరకం చీరలిచ్చినందుకు.. కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.

బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయిని  మహిళలు నిరసన తెలపడం తప్పా? మహిళలే నిరాశకు గురై స్వచ్చందంగా నిరసన తెలిపారు. బతుకమ్మ చీరల క్వాలిటీని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవి చేనేత చీరలని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది నిజం కాదా..? ప్రజల ఆగ్రహాన్ని జీర్ణించుకోలేక.. కాంగ్రెస్ పై వీమర్శలా?

బతుకమ్మ చీరల స్కామ్ లో 150 కోట్లు మింగేశారు. .చీరల పేరుతో టీఆరెస్ ఎన్నికల జిమ్ముకు పాల్పడింది. చీరలు కాల్చారని మహిళల పై కేసులు పెట్టడం సరికాదు. తక్షణమే కేసులు విత్ డ్రా చేయాలి. మహిళ లను కేసుల పేరుతో భయపెడితే సహించేదిలేదు. నాసిరకం బతుకమ్మ చీరలను ప్రభుత్వం వెంటనే వెనక్కీ తీసుకోవాలి. అంత మేరకు మహిళ ల అక్కౌంట్ లో డబ్బులు వేయాలి.

నాణ్యత కల్గిన చీరలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. .ప్రజల సొమ్ము దోచుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీ ఊర్కోదు. ఆంధ్రా నాయకులు తోలు మింగితే.. ఇప్పుడు కేసీఆర్ ఎముకలను కూడా వదలడం లేదు. మహిళలను అగౌరవ పరిచిన టీఆరెస్ ను తెలంగాణ ప్రజలు పాతరేస్తారు.

టిఆర్ఎస్ ఎంపి కవిత... ఇవే బతుకమ్మ చీర కట్టుకుని బతుకమ్మ ఆడుతుందా? ప్రతిపక్షాల ను దూషించడం కాదు .. మీ తీరు మార్చుకోండి. అధికార పొరలు కమ్ముకుని.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే.. ఖబర్దార్. మీ అంతు చూస్తాం.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి