హైదరాబాద్: ఈటల రాజేందర్ పార్టీలో చేరినా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడ బీజేపీలోనే కొనసాగుతారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు.సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి తామే ప్రత్యామ్నాయమని ఆమె తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి వ్యతిరేకించలేదన్నారు. ఈ విషయమై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై  పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ నేతలంతా కలిసి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కొత్తగా వచ్చిన నేతలతో సమన్వయలోపం లేదన్నారు. పార్టీలో బుజ్జగింపులు, అలకలు లేవన్నారు.  హుజూరాబాద్‌లో ఎవరు పోటీ చేయాలో పార్టీ నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పారు.ఎవరూ కూడ పార్టీలో చేరిన సమయంలో పార్టీ నాయకత్వం కూడ ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు. తాను పార్టీలో చేరిన సమయంలో కూడ తాను పార్టీ నాయకత్వాన్ని ఏం కోరలేదన్నారు. పార్టీ నాయకత్వం కూడ తనకు హమీలు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.

also read:టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకే ఉంది: బండి సంజయ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బీజేపీలో చేరనున్నారు. మూడు రోజుల క్రితం ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను కేబినెట్ నుండి  కేసీఆర్ భర్తరఫ్ చేశారు కేసీఆర్. ఈటల రాజేందర్ ఆక్రమించుకొన్న భూములపై విచారణకు కూడ ఆదేశాలు జారీ చేశారు.