గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ ఢిల్లీలో జరిగిన జన ఆక్రోష్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డికె అరుణ మీడియాతో మాట్లాడారు. బిజెపి మీద జనాల్లో ఎంత ఆక్రోశం ఉందో ఈ ర్యాలీతో తేలిపోయిందన్నారు. 

యువత, నిరుద్యోగులు, రైతులు ప్రతి ఒక్కరు బిజెపి సర్కారు మీద ఆగ్రహంగా ఉన్నారని ఆరోపించారు. జిఎస్టీ దెబ్బ, నోట్ల రద్దు దెబ్బతో జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. చిన్నపిల్లల మీద కూడా లైంగిక దాడులు జరగడం బాధాకరమన్నారు. ఇంకా ఆమె ఏమన్నారో పైన వీడియో ఉంది చూడండి.