పాలమూరులో టిఆర్ఎస్ కు జేజమ్మ షాక్ (వీడియో)

పాలమూరులో టిఆర్ఎస్ కు జేజమ్మ షాక్ (వీడియో)

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పాలమూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దేవరకద్రలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డికె అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక టిఆర్ఎస్ మహిళా సర్పంచ్ తో పాటు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలకు కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఒక్కసారిగా పాలమూరు రాజకీయాలు వేడెక్కాయి.

 

మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, మూసాపేట మండలంలోని జానంపేట సర్పంచ్ చెన్నమ్మతోపాటు తాళ్లగడ్డ, అచ్చయపల్లి, కందూర్ గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు చెన్నమ్మ, బాలమ్మ, సత్యమ్మ, దేవమ్మ, మల్లేష్, హామీర్, తిరుపతయ్య, అంజన్న, నాగరాజు గౌడ్, వెంకటయ్య గౌడ్, వార్డ్ మెంబర్ నాగన్న, వెంకటయ్య, సాతర్ల శ్రీనివాసులు, మండ్ల మన్యంకొండ, సాతర్ల ఆంజనేయులు, ప్రదీప్ కుమార్, లక్ష్మణ్, గట్టు ఆంజనేయులు, మనోహర్, శ్రీనివాస్, బుచ్చయ్య, శ్రీకాంత్ తదితరులు డికె అరుణ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమం దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి డోకూర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ అటు టిఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అలాగే సొంత పార్టీ నేతలకు కూడా పరోక్షంగా చురకలు వేశారు. ఆమె ఏమన్నారో పైన వీడియోలో చూడండి.

ఈ కార్యక్రమంలో మూసాపేట మండల అధ్యక్షులు బాలనర్సింహులు, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి, సురేందర్ రెడ్డి, సి.హెచ్. గోవర్ధన్,శెట్టి శేఖర్, సమరసింహా రెడ్డి, రాజేందర్ రెడ్డి, సూర్యప్రకాష్, రాముకుమార్, కుమ్మరి నరసింహజామీర్, నాగేష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page