కేసిఆర్ పై డికె అరుణ ఫైర్ (వీడియో)

dk aruna fire on kcr at jadcheral jana garjana
Highlights

దొంగ దీక్షలు చేయడం అలవాటు

జనాలను మోసం చేస్తున్నారు

తెలంగాణ ఆ నలుగురి కోసం ఇయ్యలే

 

జడ్చర్లలో జరిగిన జనగర్జన సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే డికె అరుణ సిఎం కేసిఆర్ మీద విరుచుకుపడ్డారు. ఆమె మరోసారి తిట్ల భాషలో ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ కు దొంగ సర్వేలు చేయడం అలవాటేనని ఎద్దేవా చేశారు. ఆయనకు జనాలను మోసం చేయడం అలవాటైందన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్ప పాలన పట్టడం లేదని విమర్శించారు. సోనియా తెలంగాణ ఇచ్చింది ఆ నలుగురి కోసం కాదని విమర్శించారు.  

 

దొంగ దీక్ష లు చేసిన చరిత్ర కేసీఆర్ ది అని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కేసీఆర్ కు రాజకీయంగా ప్రాణం పోసిన పాలమూర్ ,,2019లో ఆయన గద్దె కూల్చడం ఖాయమని హెచ్చరించారు. 2019లో ఉమ్మడి పాలమూర్ లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు. డికె అరుణ  ఇంకా అనేక అంశాలపై మాట్లాడారు. ఆ వీడియో కింద ఉంది చూడొచ్చు.

loader