కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ

కేంద్రం పెద్ద నోట్ల ను రద్దు చేసి బ్లాక్ మనీ పై సర్జికల్ దాడులకు దిగిందని బిజెపి గొప్పలు చెబుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ విమర్శించారు. అసలు నోట్ల రద్దు వల్ల ఇబ్బంది పడుతుందని సామాన్యులేనని, సర్జికల్ దాడులు నిజంగా వారే పైనే జరిగాయని పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయమని విమర్శించారు.

రూ.500 నోటు విడుదల చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారం రోజులు దాటినా పెద్దనోట్ల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.