మండుటెండలను లెక్క చేయకుండా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలంతా కర్ణాటకలోనే మకాం వేశారు. కర్ణాటక బార్డర్ జిల్లాల నేతలు రోజుల తరబడి ప్రచార క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేతలు సీరియస్ గా పాల్గొంటున్నారు.

గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ కర్ణాటకలో జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అక్కడ కన్నడ ప్రజలను తన ప్రసంగాలతో ఆకట్టుకుంటన్నారు. కన్నడ ప్రజలు అరుణ ను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆమెకు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.

బార్డర్ లోని రాయచూరు జిల్లాలో గద్వాల శాసన సభ్యురాలు డికె అరుణ  కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. మంగళవారం వడ్డ వాటి, కుర్వ దొడ్డి, గౌస్ నగర్ బోడం దొడ్డి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తరపున తన ప్రచారాని కొనసాగించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల‌ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జిఎస్టీ, నోట్ల రద్దుతో‌ సామాన్య ప్రజల నడ్డి విడిచారని డికె అరుణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్య కార్యక్రమం లో టీపీసీసీ కార్య వర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. రామాంజనేయులు, హన్మంత రాయ, వాట్ల షూఖూర్, కౌన్సిలర్ నల్ల రెడ్డి తదితరులు ఉన్నారు.