Asianet News TeluguAsianet News Telugu

దీపావళి 2023 : సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు.. ఐదుగురి పరిస్థితి విషమం..

ఆదివారం ఒక్కరోజే 60 మందికిపైగా కంటి ప్రమాదానికి గురయ్యారు. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడం వల్లే ప్రమాదం బారిన పడినట్టుగా తెలుస్తోంది. 

Diwali 2023 : crackers victims queued for Sarojini Devi Eye Hospital in hyderabad - bsb
Author
First Published Nov 13, 2023, 9:54 AM IST


హైదరాబాద్ : దీపావళి సంతోషంతో పాటు ప్రమాదాలనీ మోసుకు వచ్చింది. అజాగ్రత్తగా టపాసులు కాల్చడం వల్ల.. ప్రమాదాల బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒక్క హైదరాబాదులోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి 60 మందికి పైగా క్యూ కట్టారు. టపాసులు పేలడంతో..  గాయాలపాలై ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే, విచిత్రమైన విషయం ఏమిటంటే.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన వారిలో ఎక్కువ శాతం పెద్దవారే ఉండడం.

దీనిమీద సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. దాదాపు 50మంది ప్రమాద బాధితులు వచ్చారని తెలిపారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, వీరిలో ఒకరికి ఆపరేషన్ చేశామని తెలిపారు. ప్రమాద బాధితులకు డాక్టర్లు, సిబ్బంది, అవసరమైన సహాయం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 

టపాసులు పేల్చే సమయంలో వేసుకునే బట్టలు, తీసుకునే జాగ్రత్తల గురించి ఎన్ని సార్లు ఎంతగా హెచ్చరించినప్పటికీ అజాగ్రత్త జడలు విప్పుతూనే ఉంటుంది. ఈ కారణంగానే  ప్రమాదాలు తరచుగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఒక్కరోజే 60 మందికిపైగా కంటి ప్రమాదానికి గురయ్యారు. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చడం వల్లే ప్రమాదం బారిన పడినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios