దిశ నిందితుల అంత్యక్రియల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోస్ట్‌మార్టం అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే నిందితుల మృతదేహాలు ఉన్నాయి. దిశ నిందితుల అంత్యక్రియల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పోస్ట్‌మార్టం అనంతరం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే నిందితుల మృతదేహాలు ఉన్నాయి. ఎన్‌హెచ్ఆర్సీ పర్యటన తర్వాతే అంత్యక్రియలు ఉండే అవకాశాలు ఉండవచ్చునని తెలుస్తోంది.

అంతకు ముందు దిశ నిందితుల అంత్యక్రియలను రాత్రి లోగా నిర్వహించాలని భావిస్తున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. నారాయణ్‌పేట్ జిల్లా గుడిగండ్లకు చెందిన నిందితులు మహ్మద్ పాషా, నవీన్, శివ, చెన్నకేశవుల అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించేందుకు గాను పోలీసులు వ్యవసాయ పొలంలో గుంతలు తీశారు.

Also Read:అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

ఈ విషయం తెలుసుకున్న ఆ భూమి యజమానులు తమ పట్టా భూముల్లో అంత్యక్రియలు ఏంటని అడ్డుకున్నారు. గుడిగండ్లలో స్మశానం లేదు.. గ్రామ శివార్లలోని సర్వే నెం 12కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలోనే మరణించిన వారిని ఖననం చేసేవారు.  

ఈ విషయంపై పోలీసులకు అవగాహన లేకపోవడంతో ప్రోక్లెయిన్‌లతో తవ్వకాలు జరిపారు. భూ యజమానులు దీనిపై అభ్యంతరం తెలపడంతో పోలీసులు మరో చోట ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:Disha Case Accused Encounter: సీపీ సజ్జనార్ పై అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు

నిందితుల్లో ఏ-1 మహ్మాద్ ఆరిఫ్ స్వగ్రామం జక్లేర్, మిగిలిన ముగ్గురు నిందితులు చెన్నకేశవులు, శివ, నవీన్‌లు గుడిగండ్ల గ్రామానికి చెందినవారే. మరోవైపు ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి నిందితుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.