హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ అనంతరం మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు వైద్యులు. 

ఎన్ కౌంటర్ జరిగిన చటాన్ పల్లి వంతెన ప్రాంతం వద్దకు వైద్యులను పోలీసులు పిలిపించారు. షాద్‌నగర్‌ ఆర్డీవో, తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. 

ఇకపోతే ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. పోలీస్ జిందాబాద్ అంటూ పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్నారు. 

ఇకపోతే తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

disha case: జస్టిస్ ఫర్ దిశ: జయహో తెలంగాణ పోలీస్.

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 
 CP V.C. Sajjanarఎన్ కౌంటర్ స్పెషలిస్ట్: ఎవరీ వీసీ సజ్జనార్?