Asianet News TeluguAsianet News Telugu

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో విచారణ: ఢిల్లీకి సజ్జనార్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Disha Accused Encounter:Cyberabad CP Sajjanar leaves For Delhi
Author
Hyderabad, First Published Dec 10, 2019, 6:25 PM IST

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో  బుధవారం నాడు విచారణ జరగనుంది. ఈ  పిటిషన్‌పై విచారణను పురస్కరించుకొని సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు సుప్రీంకోర్టుకు హాజరుకానున్నారు.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులు: మమ్మల్ని కొట్టి రివాల్వర్ లాక్కొన్నారు

సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన మూడు పిటిషన్‌లపై సుప్రీంకోర్టులో బుధవారం నాడు జరగనుంది.   దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రెండు పిటిషన్లు,  పోలీసులపై మరో పిటిషన్ దాఖలైంది.

ఈ మూడు పిటిషన్లపై విచారణ  బుధవారం నాడు ఉదయమే జరగనుంది. దీంతో ఈ కేసు విషయంలో ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ సుప్రీంకోర్టుకు ఇవ్వనున్నారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి  ఇప్పటికే సేకరించిన ఆధారాలను పోలీసులు  జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇచ్చారు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ సాగనుంది. గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది.

దిశపై గ్యాంగ్ రేప్, హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 6వ తేదీన దిశ‌పై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులను చటాన్‌పల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హత్య చేసిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios