హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని స్పష్టం చేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కేసీఆర్ నడక, బాష, మాట్లాడే విధానం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. 

ఒక ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పై ప్రశంసలు గురిపించారు. ఇప్పటి వరకు తనకు కేసీఆర్ కులం ఏంటో తెలియదని వెలమ అంటున్నారు కాబట్టి తనకు వెలమ కులం అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. 

కేసీఆర్ అంటే ఇష్టమని చెప్పడమే కాదని ఆయన ఇష్టాలే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. సినీనటి ఇలియానా కంటే కేసీఆర్ అంటే ఇష్టమని గతంలోనే తాను ట్వీట్ చేశానని గుర్తు చేశారు. 

అది పొలిటికల్ సెటైర్ కాదని తన అభిమానమన్నారు. ఇలియానా మూడు గంటలపాటు చూడమంటే ఆసక్తిగా చూడనని కానీ కేసీఆర్ మూడు గంటల స్పీచ్ వినమంటే ఆసక్తిగా వింటానని తెలిపారు. ఆయన స్పీచ్ ని కళ్లార్పకుండా చూస్తానని తెలిపారు. 

కేసీఆర్ మాట్లాడే విధానం నచ్చుతుందన్నారు. కేసీఆర్ నడక అంటే ఇష్టమని ఆయన చూపు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగని తెలంగాణలో తనకు కేసీఆర్ తో ఏదో అవసరం ఉందని కాదన్నారు. కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా తనకు ఇష్టమన్నారు. 

హిట్లర్, బాల్ థాకరే, ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ, కేసీఆర్ అంటే ఇష్టమన్నారు. అది వారి వ్యక్తిగతంగానే తప్ప రాజకీయ కోణంలో కాదన్నారు. తాను సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నట్లు తెలిపారు. జగన్ అంటే ఇష్టం లేదా అంటే రాజకీయ పరంగా ఎవరూ ఇష్టం లేదన్నారు.  

ఇకపోతే భవిష్యత్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చిత్రాన్ని తీయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. టైగర్ కేసీఆర్ అనే టైటిల్ తో ఆయన జీవిత చరిత్ర తీస్తానని స్పష్టం చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తామని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఐలవ్ మెగాస్టార్, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నవారే... : రామ్ గోపాల్ వర్మ కామెంట్స్