హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను తాను సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ ను ఎప్పటికైనా సీఎంగా చూడాలన్నదే తన తపన అని చెప్పుకొచ్చారు. 

మెగా ఫ్యామిలీకి, తనకు మధ్య ఏవో బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు మెగా ఫ్యామిలీకి ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పుకొచ్చారు. అదంతా ప్రచారమేనని చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ చానెల్ ఇంటర్యూలో మెగా ఫ్యామిలీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

మెగాస్టార్ కుటుంబం అంటే ఒక అమెరికాలాంటిది అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని ఐలవ్ చిరంజీవి అంటూ చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన విమర్శల గురించి కూడా తెలుసునని చెప్పుకొచ్చారు వర్మ.

పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని వర్మ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను గతంలో తాను ఎన్నోసార్లు కలిశానని చెప్పుకొచ్చారు. 

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున చాలా బాగా కష్టపడుతున్నారని అయితే ఆయన చుట్టూ ఉన్న టీంపై వర్మ సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లు అంత ఉద్దండులు కాదని అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే వేదికలపై పవన్ కళ్యాణ్ స్పీచ్ తనకు ఎంతో నచ్చుతుందన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని పార్టీలో నేతలు స్ట్రాంగ్ గా లేరని విమర్శించారు. పార్టీ పటిష్టంగా లేదని తన అభిప్రాయమని అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్, మెగాస్టార్ భేటీపై.. వర్మ వెరైటీ కామెంట్స్!

పవన్ కి నాకంటే పెద్ద ఫ్యాన్ ఉండకూడదు.. ఆర్జీవీ ట్వీట్ పై కత్తి మహేష్!