Asianet News TeluguAsianet News Telugu

Fake News : వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పింఛన్ కట్.. అవాస్తవం.. ఆరోగ్య శాఖ ఖండన

ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని కోరారు. ఇలా ప్రభుత్వం మీద,  Department of Health మీద తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Director of Public Health Dr. Srinivasa Rao condemn fake news on Vaccination
Author
Hyderabad, First Published Oct 26, 2021, 1:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ : వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ప్రజా వైద్యరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని కోరారు. ఇలా ప్రభుత్వం మీద,  Department of Health మీద తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ వార్తలు ప్రజల్లో భయబ్రాంతులను, ఆందోళనను కలిగిస్తుండడంతో Director of Public Health Dr. Srinivasa Rao వివరణ ఇచ్చారు. అంతేకాదు తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రజలకు భరోసా నిచ్చారు. నిజానిజాలు కనుక్కోకుండా ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరిచారు. 

కాగా, coronavirus కారణంగా ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. covid 19 వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ ఛిన్నాభిన్నమైంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.. అపర కుబేరుల సంపద సైతం గంటల్లో ఆవిరైంది. 

వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించేలోపు కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి మరింత బలం పుంజుకుని కొరడా ఝళిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత బలపడినా.. ప్రజలను రక్షించుకోవాలంటే వున్న ఒకే ఒక్క ఆయుధం Vaccination. 

ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కానీ కొందరు అపోహలు, నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. వీరి వల్ల ఈ మహమ్మారి మరింత విస్తరిస్తునట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో telangana governament సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోని వారికి రేషన్‌, పెన్షన్‌ కట్ చేయనున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్ శ్రీనివాసరావు తెలిపినట్టుగా సోషల్ మీడియాలో, మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. 

ఈ నిర్ణయాన్ని నవంబర్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు,. డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ భయం.. వరుసగా గొర్రెల మృత్యువాత, స్థానికుల్లో ఆందోళన

కాగా.. తెలంగాణలో సోమవారం 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు గుర్తించారు. 

వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 104 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,453 మంది కోవిడ్ బారినపడగా 6,62,481 మంది కోలుకున్నారు. ఇంకా 4,023 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,949కి పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios