వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ భయం.. వరుసగా గొర్రెల మృత్యువాత, స్థానికుల్లో ఆందోళన

వరంగల్ (warangal) జిల్లాలో ఆంత్రాక్స్ (anthrax disease) కలకలం సృష్టిస్తోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోవడంతో స్థానికులను ఆందోళన కలిగిస్తోంది.

anthrax tension in warangal district

వరంగల్ (warangal) జిల్లాలో ఆంత్రాక్స్ (anthrax disease) కలకలం సృష్టిస్తోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోవడంతో స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. సాంబయ్యకు చెందిన గొర్రెల మందలో రోజుకొకటి చొప్పున చనిపోవడంతో తొగడరాయి పశువైద్యాధికారి శారద దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె శాంపిల్స్‌ను పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని పశువుల ప్రధాన ఆసుపత్రి ల్యాబ్‌కు పంపించారు. పరీక్షలలో గొర్రెలకు ఆంత్రాక్స్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో గొర్రెల కాపరులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. ఈ కారణంగా గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని సూచించారు అధికారులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios