దిగ్విజయ్‌తో భేటీ అవుతున్న టీ కాంగ్రెస్ నేతలు.. వివాదాల జోలికి పోదల్చుకోలేదన్న జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీ భవన్‌లో ఆయన పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీ భవన్‌లో ఆయన పలువురు నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు దిగ్విజయ్ సింగ్‌తో సమావేశం అవనున్నారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం నేతలు దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. నేతలతో చర్చల అనంతరం దిగ్విజయ్ సింగ్ మీడియా ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడతారని భావించినప్పటికీ.. అది వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడనున్నట్టుగా గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం తాజ్ కృష్ణ హోటల్‌లో దిగ్విజయ్ సింగ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. కొంత సంయమనం పాటించారు. దిగ్విజయ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా చెప్పారు. దిగ్విజయ్ చర్చల తర్వాత టీ కాంగ్రెస్‌లో పరిస్థితులు మారతాయని భావిస్తున్నట్టుగా తెలిపారు. పార్టీలో నాయకులంతా మాట్లాడుకునే పరిస్థితులు లేదన్నారు. తాను వివాదాల జోలికి పోదల్చుకోలేదని తెలిపారు.
ఇక, బుధవారం రాత్రి హైదాద్‌కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్‌కు కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, వీ హనుమంతరావు, అంజన్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం దిగ్విజయ్ తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. దిగ్విజయ్‌ను సింగ్‌ను కలిశారు. 2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి దిగ్విజయ్‌కు తెలిపానని, పార్టీని ముందుకు తీసుకెళ్లే అంశంపై కూడా మాట్లాడినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీలో ఉన్నందున వారు హైదరాబాద్‌లో దిగ్విజయ్‌తో సమావేశం కాలేకపోవచ్చని తెలుస్తోంది. వీరు తర్వాత విడివిడిగా దిగ్విజయ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది. అందరి నుంచి చర్చలు జరిపిన తర్వాత.. పార్టీ అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ నివేదిక అందజేయనున్నారు. అయితే ట్రబుల్ షూటర్‌గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ఎంట్రీతో టీ కాంగ్రెస్‌లో చెలరేగిన తుఫాన్ చల్లారుతుందని పార్టీలోని మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.