మహేశ్వర్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్: కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా

కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్  ఫోన్ చేశారు. ఇవాళ సాయంత్రం  కాంగ్రెస్ సీనియర్లు  మహేశ్వర్ రెడ్డి నివాసంలో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఈ భేటీని వాయిదా వేసుకోవాలని సూచించారు.

 Digvijay Singh phoned to former MLA alleti maheshwar reddy

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  దిగ్విజయ్ సింగ్  మంగళవారంనాడు  మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు.  ఇవాళ సాయంత్రం నిర్వహించతలపెట్టిన సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేయాలని  కాంగ్రెస్ అగ్రనేత  దిగ్విజయ్ సింగ్  సూచించారు. దీంతో  ఇవాళ సాయంత్రం జరిగే సమావేశాన్ని  సీనియర్లు వాయిదా వేసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే  మహేశ్వర్ రెడ్డికి  ఆ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్  మంగళవారం నాడు మధ్యాహ్నం ఫోన్ చేశారు. త్వరలోనే  హైద్రాబాద్  కు దిగ్విజయ్ వస్తానని  చెప్పారని మహేశ్వర్ రెడ్డి  చెప్పారు.  సమస్యను పరిష్కరిస్తానని దిగ్విజయ్ సింగ్  చెప్పారని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు. ఇవాళ జరిగే  సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా  మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. 

ఈ నెల 17వ తేదీన  జరిగిన సమావేశానికి కొనసాగింపుగా  ఇవాళ సాయంత్రం మహేశ్వర్ రెడ్డి నివాసంలో  భేటీ కావాలని  కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు.  కాంగ్రెస్ సీనియర్లు ఒకవైపు, రేవంత్ రెడ్డి  వర్గం  మరో వైపు  విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటుంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  సీరియస్ గా తీసుకుంది.

also read:తెలంగాణ కాంగ్రెస్‌‌పై హైకమాండ్ ఫోకస్: రంగంలోకి దిగ్విజయ్ సింగ్

ఈ సమావేశాన్ని వాయిదా వేయించాలని భావించింది. రాష్ట్ర పార్టీలో చోటు  చేసుకున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు  దిగ్విజయ్ సింగ్  ను పార్టీ నియమించింది. వెంటనే దిగ్విజయ్ సింగ్  రంగంలోకి దిగాడు. ఇవాళ సమావేశం  వాయిదా వేయాలని  సీనియర్లకు దిగ్విజయ్ సింగ్  ఫోన్ చేశారు.  

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  సూచనతో  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్  కూడా  కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్నారు. ఇవాళ జరిగే సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ  సీనియర్  నేత  కోదండరెడ్డితో మహేష్ కుమార్ గౌడ్  సమావేశమయ్యారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. మరో వైపు  కాంగ్రెస్  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కతో  మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఇవాళ సమావేశం వాయిదా వేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్  కోరారని సమాచారం.

ఈ నెల  10వ తేదీన  ఎఐసీసీ ప్రకటించిన  కమిటీలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయి.  ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కాకుండా  వలస వచ్చిన నేతలకు  ఈ కమిటీల్లో  ప్రాధాన్యత కల్పించారని  సీనియర్లు అసంతృప్తితో  ఉన్నారు.ఈ విషయాన్ని సీనియర్లు  సీరియస్  గా తీసుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. ఈ కమిటీల్లో  తన వర్గానికి  రేవంత్ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని  సీనియర్లు ఆరోపిస్తున్నారు.  దీంతో రేవంత్ రెడ్డి వర్గీయులుగా  ముద్రపడిన  12 మంది నేతలు  తమ పదవులకు రాజీనామా చేశారు.ఈ మేరకు ఈ నెల  18వ తేదీన మాణికం ఠాగూర్ కు లేఖలు పంపారు.  రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేయాలని  ఆ పార్టీ  సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే సీనియర్లతో అధిష్టానం  చర్చలు జరపనుంది.అధిష్టానానికి  ఏ విషయాలను నివేదించాలనే విషయమై సీనియర్లు చర్చించాలని ఇవాళ సమావేశం తలపెట్టారు.  అయితే  దిగ్విజయ్ సింగ్ సూచనతో  సమావేశం వాయిదా వేసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios