Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. కోమటిరెడ్డి వర్గీయుడి ఫ్లెక్సీలు బ్లేడ్లతో కత్తిరించి... (వీడియో)

సోమవారం ఉదయం నాటికి ఆదివారం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించి మరికొన్నిచోట్ల బ్లేడ్లతో కత్తిరించి, ఇంకొన్ని చోట్ల చింపివేసి కనిపించడంతో Political differences ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. 
 

Differences in Telangana Congress Party
Author
Hyderabad, First Published Nov 8, 2021, 12:32 PM IST

కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అదే పార్టీలో ఓ వర్గానికి సంబంధించిన ఫ్లెక్సీలను, హోర్డింగ్ లను, కటౌట్లను బ్లేడ్లతో కత్తిరించి చించివేశారు. దీంతో వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి.

"

కొంపల్లిలో ఫంక్షన్ హాల్ లో ఈ నెల 9 10 తేదీల్లో "కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు,, జన జాగరణ యాత్ర" పేరిట సదస్సు ఏర్పాటు చేయగా TPCC కార్యదర్శి పి. మహిపాల్ రెడ్డి ఆదివారం పెద్ద ఎత్తున భారీ హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

అయితే, సోమవారం ఉదయం నాటికి ఆదివారం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించి మరికొన్నిచోట్ల బ్లేడ్లతో కత్తిరించి, ఇంకొన్ని చోట్ల చింపివేసి కనిపించడంతో Political differences ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్న Mahipal Reddy ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడంపై ఒక్కసారిగా ఆ వర్గం ఆగ్రహంతో ఉన్నారు. ఏది ఏమైనా సదస్సుకు ఒకరోజు ముందే వర్గ విభేదాలు బయటపడడం సమావేశం లో సైతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడు కోవడం విశేషం.

టీ.కాంగ్రెస్‌కు మరో షాక్ : పార్టీనీ వీడనున్న ప్రేమ్‌సాగర్ రావు, నవంబర్ 10 వరకు డెడ్‌లైన్.. లేకుంటే..?

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు  Telangana Congress పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy,మాజీ ఎమ్మెల్సీ prem sagar rao లను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు.

ప్రేమ్‌సాగర్ రావు  కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇచ్చిన అల్టిమేటం‌పై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆరా తీశారు. ఈ విషయమై పార్టీ రాష్ట్ర నాయకులకు ఫోన్ చేసి ఠాగూర్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రేమ్ సాగర్ రావు  తో ఎఐసీసీ కార్యదర్శి Bose Raju చర్చలు జరుపుతున్నారు.

మూడు రోజుల్లో తాను లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరైన సమాధానం చెప్పకపోతే కొత్త పార్టీ పెడతామని ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించారు. మాజీ మంత్రి వినోద్ కు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘంలో చోటు కల్పించడంపై ఆయన మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో తాను రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తే తన పేరును కూడా ప్రస్తావించలేదన్నారు. 

పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ పై కూడా ఆయన మండిపడ్డారు. ఆయనో ప్రిన్సిపాల్, తాము ఎల్‌కేజీ పిల్లలమని భావిస్తున్నారని  ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి లేదా శ్రీధర్ బాబులకు పీసీసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ ను పట్టించుకోలేదన్నారు.

ఈ వ్యాఖ్యల గురించి Manickam Tagore  తీశారు.  వెంటనే ప్రేమ్ సాగర్ తో చర్చించాలని ఠాగూర్  పార్టీ నాయకులను ఆదేశించారు. దీంతో బోస్ రాజు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.ఇదిలా ఉంటే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాజీ ఎంపీ వి. హనుమంతరావు శనివారం నాడు చర్చించారు. 

ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సీనియర్లు ఈ సమావేశానికి రావడం లేదని వి.హనుమంతరావు గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సమావేశానికి రాని విషయాన్ని ప్రస్తావించారు.ఈ విషయమై తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చిస్తానని హనుమంతరావు చెప్పారు. హనుమంతరావు చేసిన ప్రతిపాదనకు మాణికం ఠాగూర్ ఒకే చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios