తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో రచ్చ (వీడియో)

Differences cropped up in TDP min mahanadu
Highlights

షాకింగ్ న్యూస్..

తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు రచ్చ రచ్చ అయింది. పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. ఇదంతా ఎక్కడ జగిందంటే యాదాద్రి జిల్లాలో. యాదాద్రి జిల్లా మినీ మహానాడు సోమవారం జరిగింది.

"

ఈ సందర్భంగా స్థానిక నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ను మినీ మహానాడుకు ఆహ్వానించలేదు. దీంతో ఆయన అనుచరులు మహానాడులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మోత్కుపల్లిని పిలవలేదని నిలదీశారు. ఈ సందర్భంగా టిడిపి తెలంగాణ అధ్యక్షులు రమణ, జిల్లా అధ్యక్షురాలు శోభారాణితో వాగ్వాదానికి దిగారు. చాలాసేపు ఆందోళన చేయడంతో వాళ్లకు రమణ, శోభారాణి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి కూడా పాల్గొన్నారు. మోత్కుపల్లి అనుచరుల ఆందోళన వీడియో పైన ఉంది చూడండి.

loader