కేసిఆర్ ఫార్ములానే మోడీ అమలు చేసిండు (వీడియో)

First Published 19, Dec 2017, 2:10 PM IST
Did BJP follow the KCR formula in Gujarat to ensure opposition divided
Highlights
  • నరేంద్ర మోడీపై రేవంత్ రెడ్డి ఫైర్
  • కేసిఆర్ రాక్షస ఫార్ములా అమలు చేసిండు
  • ఒక్క రాహుల్ ను ఎదుర్కునేందుకు 182 మందిని దింపిండు

చాన్స్ దొరికితే తెలంగాణ సిఎం కేసిఆర్ పై విరుచుకుపడే రేవంత్ రెడ్డి మరోసారి చాన్స్ దోలాడుకుని మరీ విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో ఇప్పుడిప్పుడే రేవంత్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ తరుణంలో గుజరాత్ ఎన్నికల మీద రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సిఎం కేసిఆర్ ఫార్ములానే గుజరాత్ లో నరేంద్ర మోడీ, అమిత్ షా అమలు చేశారంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు రేవంత్.

తెలంగాణలో అరాచకంగా, అక్రమంగా ప్రతిపక్షాలను చీల్సి ఏవిధంగానైతే రాక్షస క్రీడకు కేసిఆర్ తెర లేపిండో అదే తరహాలో గురరాత్ లో కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం వ్యవహరించారని ఆరోపించారు రేవంత్. ఎన్నికలకు పదిహేను రోజుల ముందు గుజరాత్ సిఎల్పీ నాయకుడిని అదరించి బెదిరించి బిజెపిలో చేర్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరుపున గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నామన్నారు.

22 ఏండ్లు వరుసగా అధికారంలో లేకపోయినా గుజరాత్ కాంగ్రెస్  పార్టీ నాయకులు మనో నిబ్భరం కోల్పోకుండా చేసిన పోరాటాన్ని తెలంగాణలో ఆదర్శంగా తీసుకుంటామన్నారు. అక్కడ అంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని నిలబెడుతుంటే.. ఇక్కడ మూడేళ్లు అధికారం లేకపోతేనే కార్యకర్తలను గాలికొదిలేసి పార్టీ మారే పిసిసి అధ్యక్షులు ఉన్నారని చురకలంటించారు.

ఒక ప్రధాని దిగజారకూడని స్థాయికి నరేంద్ర మోడీ గుజరాత్ లో దిగజారిపోయారని ఆరోపించారు. కులం, మతం పేరుతో రెచ్చగొట్టినా 99 సీట్లే గెలిచారని ఎద్దవా చేశారు. ఒక్క రాహుల్ గాంధీని ఎదుర్కొనేందుకు గుజరాత్ లో 182 మంది బిజెపి నాయకులు అవసరమయ్యారా అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ లో సుపారీ ఇచ్చారంటూ దిగజారి విమర్శలు చేయడం నరేంద్ర మోడీకే చెల్లిందన్నారు. 130 కోట్ల జనాభాకు ప్రతినిధి అయిన నరేంద్ర మోడీ ఒక రాష్ట్రంలో ఎన్నికల కోసం ఇంతగా నిస్సిగ్గుగా మాట్లాడడం బాధాకరమన్నారు.

 

రేవంత్ రెడ్డి బిజెపిపై చేసిన విమర్శల తాలూకు ఫుల్ వీడియో ఈ కింద చూడండి

 

loader