హైదరాబాద్: పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఈ నెల 10వ తేదీవరకు స్టే పొడిగిస్తూ  తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ధరణి పోర్టల్ పై దాఖలైన పిటిషన్ పై   తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది.ధరణి పోర్టలో లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని హైకోర్టు తెలిపింది.పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు సూచించింది.

ధరణిలో  వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను  ఈ నెల 10వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది.వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై ఉత్తర్వులు ఎత్తివేయాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు.

also read:ధరణి పోర్టల్‌‌లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల నమోదు: కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాక్

ధరణి జీవోల కౌంటర్లు దాఖలు చేయాలని  హైకోర్టు ఆదేశించింది.మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని అడ్వకేట్ జరనల్  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ధరణి పోర్టల్ కోసం సేకరించిన డేటాకు చట్టబద్దమైన భద్రత ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.