తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే వరంగల్ మేడారం జాతర ఇవాళ్టి నుండి మొదలయింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో పాల్గొనడానికి రాష్ట్ర నలు మూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుండటంతో మేడారం కు వెళ్లే దారుల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ ను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. అధికారుల మధ్య సమన్వయ లోపంతో భక్తులు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు.

పొద్దున్నుంచి ఇదే సమస్య కొనసాగుతుండటంతో దీన్ని క్లియర్ చేయడానికి డీజీపీ మహేందర్ రెడ్డి రంగంలోకి దిగారు. హుటాహుటిన హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో మేడారానికి చేరుకున్న డీజీపీ పరిస్థితులను చక్కదిద్దే పనుల్లో పడ్డారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పోలీస్ అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రముఖుల రాక నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశించారు.

 

ట్రాఫిక్ జామ్ వీడియో