హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని లిస్బన్ క్లబ్ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆరా తీశారు.  క్లబ్ డ్యాన్సర్‌గా పనిచేసే ఓ యువతిపై అసాంఘిక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం దానికి ఆ యువతి ఒప్పుకోలేదు.దీంతో ఆ యువతిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫఇర్యాదు చేసింది.

బాధితురాలు 100 ఫోన్ చేస్తే పోలీసులు నిందితులకే  మద్దతుగా నిలిచారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఆదివారం నాడు ఈ ఘటనపై డీజీపీ ఆరా తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు.పంజగుట్ట సీఐతో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు.

ఈ కేసుకు సంబంధించిన నివేదిక త్వరగా అందించాలని ఆదేశించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకొంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న ఇదివరకే ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.