పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో గోల్ మాల్ జరిగిందని వస్తున్న వార్తలను పోలీసు శాఖ ఖండించింది. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమేనని వాటిని నమ్మొద్దని పేర్కొంది. నిబంధనల ప్రకారమే ఎంపిక జరిగిందని,  కటాఫ్ మార్కులను  త్వరలో ప్రకటిస్తామని  తెలిపింది.

 

ఫలితాల కు సంబంధించి అనుమానాలు ఉంటే తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని  డీజీపీ అనురాగ్ శర్మ అభ్యర్థులకు సూచించారు. కటాఫ్ మార్కులను కూడా వెబ్ సైట్ లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

 

ఇదే అంశంపై స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ..  ఫలితాలపై సందేహాలుంటే అభ్యర్థులు తమను సంప్రదించవచ్చన్నారు. ఓపెన్ ఛాలెంజ్ విధానాన్ని అభ్యర్ధులందరికీ కల్పిస్తామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మెద్దన్నారు.