సలేశ్వరం జాతరకు ఇవాళ్టి నుండే అనుమతివ్వాలని కోరుతూ భక్తులు శ్రీశైలం- అచ్చంపేట రహదారిలో ఉన్న అటవీశాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రేపటి నుండి సలేశ్వరం జాతర కొనసాగనుంది.
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో Saleshwaram జాతరకు అనుమతి లేదని అటవీశాఖాధికారులు చెప్పడంతో ఈ యాత్రకు వెళ్లేందుకు వచ్చిన Devotees అచ్చంపేట-శ్రీశైలం మార్గంలోని రోడ్డుపై బైఠాయించి Protest దిగారు. నల్లమల అటవీ ప్రాంతంలో సలేశ్వరం యాత్రకు మూడు నుండి నాలుగు రోజుల పాటు మాత్రమే Forest అధికారులు అనుమతి ఇస్తారు.ఈ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు సలేశ్వరం జాతర నిర్వహించనున్నారు.
ఈ జాతరకు వెళ్లేందుకే ఇవాళే పెద్ద ఎత్తున భక్తులు నల్లమల అటవీ ప్రాంతం ఎంట్రెన్స్ వద్దకు చేరుకున్నారు. అయితే రేపటి నుండి ఈ జాతర ఉన్నందున ఇవాళ భక్తులను అటవీశాఖ సిబ్బంది అనుమతించలేదు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు. తమను సలేశ్వరం జాతరకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతం ఎంట్రెస్స్ వద్ద టోల్ రుసుమును వసూలు చేయాలని పారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇవాళ భక్తులను అనుమతించడం లేదనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఎంతో దూరం నుండి జాతరకు వెళ్లేందుకు వచ్చిన తమను నిలిపివేయడంతో భక్తులు ఆందోళనకు దిగారు.
దట్టమైన అడవి ప్రాంతంలో లోయలో వెలిసిన లింగమయ్యను దర్శనం చేసుకొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సలేశ్వరం జాతరకు వెళ్లాలంటే కాలి నడకన వెళ్లాల్సిందే. ప్రతి ఏటా ఉగాది దాటిన తర్వాత తొలి పౌర్ణమికి ఈ జాతరను నిర్వహిస్తారు. శ్రీశైలం ఆలయానికి 60 కి.మీ. దూరంలో సలేశ్వరం ఉంటుంది.నల్లమల అటవీ ప్రాంతంలోనే 30 కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సలేశ్వరం వద్ద జలపాతం కనువిందు చేస్తుంది. సలేశ్వరం వద్ద శివుడు లింగం రూపంలో దర్శనమిస్తాడు. ప్రతి ఏటా మూడు నుండి నాలుగు రోజుల పాటు మాత్రమే ఇక్కడికి భక్తులను అనుమతిస్తారు.
