చేరాలనిపిస్తోంది: కేటీఆర్ రైలుబండి బడికి దేవిశ్రీ ప్రసాద్ ఫిదా

Devisri Prasad fida to Siricilla school
Highlights

సిరిసిల్ల జిల్లాలో రైలు బడి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ స్కూల్ కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఫిదా అయ్యారు.

హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలో రైలు బడి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ స్కూల్ కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఫిదా అయ్యారు.

ఆ పాఠశాల  ఫొటోలను తెలంగాణ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెటిజన్లతో పాటు ప్రముఖులు కూడా ఆ పాఠశాలపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ట్విట్టర్ వేదికగా దానిపై స్పందించారు. 

అద్భుతంగా ఉన్నాయి కేటీఆర్ బ్రదర్.. ఇలాంటి స్కూల్‌కు వెళ్లకుండా ఏ విద్యార్థి ఉంటాడంటూ ట్వీట్ చేశారు. ఆ స్కూల్‌లో చేరాలనిపిస్తోందని తన కోరికను ఆయన వెల్లడించారు.
 
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి రైలుబోగీల రూపంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ తో ఈ స్కూల్‌ రూపుదిద్దారు. 

 

loader