ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.  

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. శ్రావణి ఆత్మహత్యకు కారకులుగా భావిస్తూ.. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. వారిలో ఇద్దరు నిందితులు దేవరాజ్, సాయి కృష్ణలను ఇటీవల చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా.. ప్రస్తుతం ఆ ఇద్దరినీ మళ్ళీ మూడు రోజులపాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 