ఆర్బిఐ గణంకాల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో రూ. 15 లక్షల కోట్ల రద్దైన నోట్లున్నాయి. వాటిస్ధానంలో కొత్త నోట్లను వెంటనే తీసుకురావాలంటే అంత సులభం కాదు.
నిజంగా దేశ ప్రజలకు ఇది చేదు వార్తే. రద్దైన నోట్ల స్ధానంలో కొత్త నోట్లు పూర్తిస్ధాయిలో ప్రజల వద్దకు చేరాలంటే కనీసం మరో ఆరు నెలలు పడుతుందని ఆర్ధిక వేత్తలు స్పష్టంగా పేర్కొంటున్నారు. మొన్నటి వరకూ చెలామణిలో ఉన్న వెయ్యి, 500 రూపాయల నోట్లను ప్రధానమంత్రి హటాత్తుగా రద్దు చేయటంతో దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. అయితే, రద్దైన నోట్ల స్ధానంలో కొత్తగా 2 వేలు, 500 రూపాయల నోట్లను చెలామణిలోకి తెచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదు.
ఎందుకంటే, 2 వేలు, 500 రూపాయలకు ఎవరి వద్దా చిల్లర లేదు. దానికి తోడు అప్పటికే 100, 50 రూపాయల చిన్న నోట్ల చెలామణి తగ్గిపోయిన కారణంగా ఒక్కసారిగా చిల్లర సమస్య పెరిగిపోయింది. పెద్ద నోట్లు పూర్తిస్దాయిలో చెలామణిలోకి రాక, చిన్న నోట్లు సరిపడా అందుబాటులో లేక దేశవ్యాప్తంగా ప్రజలు 10 రోజులుగా అవస్తలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో రద్దైన నోట్ల స్దానంలో కొత్త నోట్లను పూర్తిస్దాయిలో చెలామణిలోకి తేవాలంటే వచ్చే ఏడాది మే నెల వరకూ ఆగాల్సిందేనంటూ ఆర్దిక వేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికీ దేశంలో నిత్యమూ జరుగుతున్న చెల్లింపులు, కొనుగోళ్ళలో 95 శాతం కరెన్సీ రూపంలోనే ఉన్నట్లు ఆర్ధిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ అవసరాలు తీరాలంటే కొత్త నోట్ల ముద్రణ పూర్తిస్దాయిలో జరగాలన్నారు. అందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అప్పటి వరకూ దేశ ఆర్దిక రంగంపై తీవ్ర ప్రభావం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు.
ఆర్బిఐ గణంకాల ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో రూ. 15 లక్షల కోట్ల రద్దైన నోట్లున్నాయి. వాటిస్ధానంలో కొత్త నోట్లను వెంటనే తీసుకురావాలంటే అంత సులభం కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ్ ప్రైవేటు లిమిటెడ్ (బిఆర్ఎన్ఎం) ప్రింటింగ్ సామర్ధ్యం నెలకు రూ. 130 కోట్ల నోట్లే. కొత్త నోట్ల ముద్రణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇపుడే సిబ్బంది డబుల్ షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. మరికొంత మందిని చేర్చుకున్నా, మూడో షిఫ్ట్ లో పనిచేయించినా అదనంగా జరిగే ప్రింటింగ్ కేవలం మరో 70 కోట్ల నోట్లు మాత్రమే. అంటే నెలకు 200 కోట్ల నోట్లు మాత్రమే ప్రింట్ అయ్యే అవకాశం ఉంది.
అంటే రద్దైన 1000 రూపాయల నోట్ల స్ధానంలో కొత్తగా తీసుకు వచ్చిన 2 వేల రూపాయల నోట్ల పూర్తిస్ధాయి ప్రింటింగ్ జరగాలంటే ఈ ఏడాది డిసెంబర్ చివర వరకూ పడుతుంది. దాని తర్వాత రూ. 500 నోట్ల ముద్రణ చేపట్టాలి. దానికి మరో నాలుగు మాసాల సమయం పడుతుంది. అంటే పూర్తి స్ధాయిలో కొత్త నోట్లు ప్రజల వద్దకు రావాలంటే వచ్చే నెల మే నెలవరకూ ఆగక తప్పదు. అప్పటి వరకూ ప్రజలు ఇక్కట్లు తప్పవు.
