రూ.పది కోట్ల విలువ కొకైన్ ని అక్రమంగా రవణా చేసిన యువతికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. మూడేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన యువతి రూ.పది కోట్ల విలువచేసే కొకైన్ ని అక్రమంగా తరలిస్తుండగా... శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులకు పట్టుబడింది. ఈ కేసుకు ఇటీవల కోర్టులో విచారణకు వచ్చింది.

యువతికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ రాజేంద్రనగర్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష కొనసాగుతుందన్నారు. ఢిల్లీకి చెందిన జ్యోతి.. 2016 మే 17న దుబాయ్‌ నుంచి రూ.10 కోట్ల విలువ చేసే కొకైన్‌ను తెచ్చి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడింది.