తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 11, 20, 21 ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు కవితను విచారించారు. ఆ తర్వాత ఈడీ అధికారులు మళ్లీ కవితకు నోటీసులు జారీచేయలేదు. అయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఈడీకి కవిత అందజేసిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని అందులో పేర్కొన్నారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కవిత తన తరపున ఈడీ కార్యాలయానికి లాయర్ సోమా భరత్‌ను పంపారు. దీంతో భరత్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 21న ఈడీ విచారణకు హాజరైన సమయంలో కవిత తన ఫోన్‌లను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ రోజు ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద, ఈడీ కార్యాాలయం వద్ద.. తాను అధికారులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్న ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు.
ఇక, ఈ నెల 16వ తేదీన కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో కూడా తాను హాజరుకాలేదని, తన ప్రతినిధితిగా సోమా భరత్‌ను పంపుతున్నట్టుగా కవిత చెప్పిన సంగతి తెలిసిందే. ఆ రోజు కవిత ప్రతినిధి ఈడీ ఎదుటకు వెళ్లినా సోమా భరత్.. నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
