ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది సోమా భరత్‌ వరుసగా రెండో రోజు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాది సోమా భరత్‌ వరుసగా రెండో రోజు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే విచారణలో భాగంగా అప్పగించిన ఫోన్లను యాక్సెస్ చేయడానికి కవిత లేదా ఆమె తరఫున ప్రతినిధి ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు కోరారు. ఈ క్రమంలోనే మంగళవారం కవిత ప్రతినిధిగా సోమా భరత్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన సమక్షంలోనే కవిత సమర్పించిన ఫోన్లను యాక్సెస్ చేసి.. డేటాను సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా మరోసారి ఈరోజు సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ నెల 11, 20, 21 ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు కవితను విచారించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న ఈడీ విచారణకు హాజరైన సమయంలో కవిత తన ఫోన్‌లను ఈడీ అధికారులకు అందజేశారు. ఆ రోజు ఉదయం ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద, ఈడీ కార్యాాలయం వద్ద.. తాను అధికారులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్న ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు. 

ఇక, ఈ నెల 16వ తేదీన కూడా కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. ఆ సమయంలో కూడా తాను హాజరుకాలేదని, తన ప్రతినిధితిగా సోమా భరత్‌ను పంపుతున్నట్టుగా కవిత చెప్పిన సంగతి తెలిసిందే. ఆ రోజు కవిత ప్రతినిధిగా సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు.