Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్: అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ క‌విత పేరు.. !

Hyderabad: ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచార‌ణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల రిమాండ్ రిపోర్టులో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉంది. ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సహా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో నిందితులు తమ ఫోన్‌లను చాలాసార్లు మార్చారనీ, సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం ఆరోపించింది.

Delhi liquor scam: MLC Kavita's name in Amit Arora's remand report. Here are the details
Author
First Published Nov 30, 2022, 10:56 PM IST

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఒక్కొక్క‌టిగా వెలుగుచూస్తున్న విష‌యాలు పొలిటిక‌ల్ హీట్ ను రాజేస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) నేత‌ల‌కు ఈ కుంభ‌కోణంతో సంబంధం ఉంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప‌దేప‌దే ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పేర్కొన్నారు. ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సహా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో నిందితులు తమ ఫోన్‌లను చాలాసార్లు మార్చారనీ, సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం ఆరోపించిందని ఇండియా టూడే నివేదించింది. 

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా ఈ కుంభకోణానికి సంబంధించిన కొన్ని వివరాలను రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 32 పేజీల నివేదికలో కవిత పేరును ప్రస్తావించడంతో పాటు ఎమ్మెల్సీ వద్ద పది మొబైల్ ఫోన్లు ఉన్నాయని పేర్కొన్నారు. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ స్పష్టం చేసింది. వీటిలో కవిత రెండు నెంబర్లు వాడిన‌ట్లు రిపోర్టు పేర్కొంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద మొబైల్ ఫోన్‌ల IMEI నంబర్లు ఉన్నాయి.  ఈ స్కామ్‌లో కీలకమైన సాక్ష్యంగా ఉన్న ఫోన్‌లను ధ్వంసం చేయడానికి కవిత ప్రయత్నించారని పేర్కొంది.  త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌..  ఢిల్లీ మద్యం కుంభకోణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. అంతేకాకుండా, ప్రతిపక్ష నేత‌ల‌తో పాటు, భారతీయ జనతా పార్టీ ఆరోపించినప్పుడు, ఆరోపణలు చేస్తున్న వారిపై ఇంజెక్షన్ ఆర్డర్ కోరుతూ కోర్టును ఆశ్రయిస్తానని కవిత చెప్పారు.

ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సహా ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో నిందితులు తమ ఫోన్‌లను చాలాసార్లు మార్చారనీ, సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం ఆరోపించింది. కల్వకుంట్ల కవిత, మనీష్ సిసోడియా, కైలాష్ గహ్లోత్ వంటి రాజకీయ నాయకులతో సహా 32 మంది నిందితులు/ అనుమానితులు ఎక్సైజ్ పాలసీ కుంభకోణం జరిగిన సమయంలో పలు ఫోన్లు మార్చుకున్నారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌పై దర్యాప్తునకు సంబంధించి వ్యాపారవేత్త అమిత్ అరోరాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం 7 రోజుల కస్టడీకి మంజూరు చేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు అమిత్ అరోరాను ఆర్థిక దర్యాప్తు సంస్థ ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios