ఢిల్లీ లిక్కర్ స్కాం: హైద్రాబాద్ సహా దేశంలోని 35 చోట్ల ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దేశంలోని 35 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఇవాళ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న  సమీరు మహేంద్రు ఇచ్చిన సమాచారంమేరకు ఈడీఅధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 

 Delhi liquor scam: ED raids under way at 35 locations across country

న్యూఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  దేశంలోని 35 ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా  సన్నిహితుడు దీనేష్ఆరోరా నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సమీర్ మహేంద్రు  ను ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సమీర్ మహేంద్రు ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. అయితే మరో నాలుగు రోజుల పాటు కస్టడీని కోర్టు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. ఈ నాలుగు రోజుల పాటు ఈడీ అధికారులు మహేంద్రు  నుండి కీలక సమాచారాన్నిరాబట్టే ప్రయత్నం చేయనున్నారు.

. ఢిల్లీ లిక్కర్  స్కాం లో ఈడీ అధికారులు దేశంలోని  పలు చోట్ల ఏక కాలంలో దాడులు చేస్తున్నారు. దేశంలో ఏక కాలంలో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది నాలుగో సారి. హైద్రాబాద్  లో  ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.అరుణ్ రామచంద్రపిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావు,అభిషేక్ రావులకు చెందిన కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై ఈడీ అధికారులు ఆరాతీస్తున్నారు.  గతంలో కూడా హైద్రాబాద్ కేంద్రంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది

 ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 16న దేశంలోని 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  తెలంగాణలోని 12 మందితోపాటు 18 కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 6,7 తేదీల్లో కూడా ఈడీఅధికారులు హైద్రాబాద్ లో సోదాలు చేశారు.  హైద్రాబాద్ లోని ప్రముఖ ఆడిటర్ నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో సేకరించిన సమాచారం ఆదారంగా సెప్టెంబర్ 19వ తేదీన ప్రముఖ బిల్డర్ శ్రీనివాసరావు నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.ఈ సోదాల్లో కీలక సమాచారం సేకరించారు. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వెన్నమనేని శ్రీనివాసరావుకు షాక్.. సోమవారం ఢిల్లీకి రమ్మన్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ కు చెందిన  పలు కంపెనీల పాత్ర ఉందని ఈడీ అనుమానిస్తుంది.ఈ విషయమై ఆదారాలు సేకరిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం  విషయమై  ఆప్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. అయితే ఈ విమర్శలను ఆప్  ప్రభుత్వం తోసిపుచ్చుతుంది.  ఉద్దేశ్యపూర్వకంగానే తమపైబీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం  విషయమై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. మనీష్ సిసోడియా ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. సిసోడియా బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు.. తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలపై ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మనీష్ సిసోడియా సన్నిహితుడు  దినేష్ ఆరోరా నివాసంలో సోదాలు 

దినేష్ ఆరోరాకు చెందిన ఇల్లు, ఆఫీస్ తో పాటు అతని స్నేహితుల ఇళ్లలోకూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దినేష్ ఆరోరాకు చెందిన బ్యాంకు ఖాతాలోకి కోటి నగదు బదిలీ అయిందని ఈడీ అధికారులు గుర్తించారు.రాధాకృష్ణ ఇండస్ట్రీస్  ద్వారా దినేష్ ఆరోరాకు చెందిన యూకో బ్యాంకు ఖాతాకు ఈ నగదు బదిలీ అయిందని ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకుఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే దినేష్ ఆరోరాపై సీబీఐ కేసు నమోదైంది. ఈ డబ్బులను మనీష్ సిసోడియాకు దినేష్ ఆరోరా ఇచ్చారని ఈడీ అధికారులు గుర్తించారని ఆ కథనం తెలిపింది. 

సమీర్ మహేంద్రు, అర్జున్ పాండే, విజయ్ నాయర్,అరుణ్ రామచంద్రు పిళ్లై లు రూ.  5 కోట్లు బదిలీ చేశారని ఈడీ గుర్తించిందిని ఈ కథనం వివరించింది.  ఈడీ కస్టడీలో ఉన్న సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios