Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వెన్నమనేని శ్రీనివాసరావుకు షాక్.. సోమవారం ఢిల్లీకి రమ్మన్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెన్నమనేని శ్రీనివాసరావును ఢిల్లీకి రావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. దీంతో సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు వెన్నమనేని. ఇప్పటికే వెన్నమనేనిని రెండు రోజుల క్రితం దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు.
 

enforcement directorate orders to vennamaneni srinivasa rao for attend inquiry in delhi on monday
Author
First Published Sep 21, 2022, 8:25 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెన్నమనేని శ్రీనివాసరావును ఢిల్లీకి రావాల్సిందిగా ఈడీ ఆదేశించింది. దీంతో సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు వెన్నమనేని. అంతకుముందు ఈ కేసుకు సంబంధించి బుధవారం ముగ్గురిని అధికారులు ప్రశ్నించారు. వీరిలో వెన్నమనేని శ్రీనివాసరావు, సాలిగ్రామ్ టెక్నాలజీ ఎండీ, జోనా కన్సల్టెంట్ సిబ్బందిని ఈడీ అధికారులు విచారించారు. వీరు రామచంద్ర పిళ్లైతో కలిసి పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఇప్పటికే వెన్నమనేనిని రెండు రోజుల క్రితం దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. శ్రీనివాసరావు కంపెనీ ద్వారానే ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. వెన్నమనేని దాదాపు ఆరు కంపెనీలలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. 

ఇకపోతే.. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్ర ప్రైవేట్ లిమిటెడ్, హైద్రాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీ, వరుణ్  సన్ షోరూమ్, గోల్డ్ స్టార్ మైన్స్, మినరల్స్ అనే సంస్థలను శ్రీనివాసరావు నిర్వహిస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారు.  లిక్కర్ స్కాం  విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅరుణ్ రామచంద్రపిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావు, అభిషేక్ రావు, సృజన్ రెడ్డిలకు  శ్రీనివాసరావు సంస్థల నుండే  విమాన టికెట్లు బుక్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

ALso REad:ఢిల్లీ లిక్కర్ స్కాం: బిల్డర్ శ్రీనివాసరావు నుండి కీలక సమాచారాన్ని సేకరించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో శ్రీనివాసరావు తో సంభాషణను కూడా ఈడీ అధికారులు సేకరించారు. ఈ విషయమై ఇద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నించారని కూడా ఈ  కథనం తెలిపింది. కోట్లాది రూపాయాల లావాదేవీలు శ్రీనివాసరావు ద్వారా జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఈ డబ్బులను ఎందుకు ఉపయోగించారనే విషయమై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని ఆ కథనం  తెలిపింది.  బిల్డర్ శ్రీనివాసరావు కంపెనీల నుండే ముడుపులు వెళ్లాయా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఈ కథనం వివరించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios