Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ మనసు గెలిచిన తెలంగాణ కేటిఆర్

  • తెలంగాణ ఐటి రంగాన్ని అభినందించిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా
  • ఢిల్లీలో తెలంగాణ తరహా సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటన
  • ఐటి లో తెలంగాణ దూసుకుపోతున్నట్లు చెప్పిన సిసోడియా
delhi diputy cm sisodia prizes ktr

తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్ ఢిల్లీ మనసు గెలిచాడు. అదేంటి తెలంగాణ మంత్రి ఢిల్లీ మనసు గెలవడమేంది అనుకుంటున్నరా? అయితే ఈ వార్త మీకోసమే చదవండి.

ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేటిఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరి భేటీ సందర్భంగా పలు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ఐటి మరియు ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. డీల్లీ ప్రభుత్వం త్వరలో ఒక ఇంక్యూటేర్ ను ప్రారంభించే అలోచన చేస్తున్నదని మనీష్ సిసోడియా తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం టి హబ్ అనుభావాలు పంచుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఐటి మరియు ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ ను నిర్మించిన తీరును మంత్రి కెటి రామారావు వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటి పరిశ్రమలో ఉన్న ఒక అన్చిత పరిస్ధితిని తొలగించి, ఒక కొత్త ఉపు తీసుకుని వచ్చేందుకు టి హబ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ టి హబ్ ను కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా దేశంలోని ఏవరైనా భాగస్వాములయ్యేలా అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి టి హబ్ గొప్ప పేరు తెచ్చిన విజయవంతమైన కార్యక్రమంగా మంత్రి తెలిపారు. దీంతో నగరంలో స్టార్టప్ కల్చర్ బాగ పెరిగిందని, యువతకు అశలకు గొప్ప అలంబన దొరికిందన్నారు.

టిహబ్ గురించి తాము సైతం విన్నామని, అందుకే టి హబ్ ను సందర్శిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీష్ సిసొడియా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఐటి రంగంలో, మరియు ఇన్నోవేషన్ రంగంలో మంచి ప్రగతి సాధించిందన్నారు. ఈ రంగంలో తెలంగాణ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ మేరకు తాము ఏర్పాటు చేయనున్న ఇంక్యూబేటర్ ఏర్పాటు కోసం టి హబ్ ఏర్పాటు చేసిన పద్దతిని అదర్శంగా తీసుకుంటామన్నారు. డీల్లీలోని ఉన్నత విద్యాసంస్ధలు, పరిశ్రమ వర్గాలను కలుపుకుని ఈ ఇంక్యూబేటర్ ఏర్పాటులో భాగస్వాములను చేసుకోవాలని మంత్రి కెటియార్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఐటి మరియు గేమింగ్, యానిమేషన్, డాటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు ప్రత్యేకంగా రూపొందించుకున్న పాలసీలను ఈ సందర్బంగా ఇరువురు చర్చించుకున్నారు. రానున్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గేమింగ్, డాటా అనాలిటిక్స్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనీష్ ప్రసంశించారు. 

తెలంగాణ రాష్ర్టం ఇప్పటికే గోవా, ఒరిస్సా వంటి రాష్ర్టాలతో ఐటి రంగంలో అభివృద్దికి నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటున్నదని తెలిపిన మంత్రి, డీల్లీకి ఇన్నోవేషన్ రంగంలో సహాకారం అందిస్తామన్నారు. డీల్లీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను అధ్యయనం చేయాల్సిందిగా తమ ప్రభుత్వ అధికారులను కోరామని, నిన్ననే ఏన్డీయంసి అధికారులతో సమావేశం అయ్యామనన్నారు. ఇలా రెండు రాష్ర్ట ప్రభుత్వాల మద్య అధర్శ విధానాలు, పాలసీలు, పథకాల పైన పరస్పర సహాకారం అందించుకోవడం అంతిమంగా దేశాభివృద్దికి దొహదం చేస్తుందని మంత్రులు అన్నారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బృందం ఈరోజు టిహభ్ను సందర్శించింది. అయన బృందంలో డీల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిఐఐ ప్రతినిధులు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios