సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు రద్దు: గెజిట్ విడుదల
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ గెజిట్ విడుదల చేసింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ ను కేంద్ర రక్షణ శాఖ రద్దు చేసింది. దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డులకు కేంద్రం ఎన్నికలకు నిర్వహణకు గాను నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తొలుత ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఎనిమిది వార్డులున్నాయి. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు జరిగాయి. 2020మ ఫిబ్రవరిలో కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో కేంద్రం నామినేటేడ్ సభ్యుడిని నియమించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి నోటిపికేషన్ జారీ చేయడంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ నెల 23న విచారణ జరగనుంది.