పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురించిన వార్త ఇది. చల్లా ధర్మారెడ్డి పేరు వినగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి రెండే రెండు. అందులో ఒకటి ఆయన టిడిపిలో గెలిచారు. అనంతర కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక రెండో ముచ్చటేమంటే.. ఇటీవల చల్లా ధర్మారెడ్డి మంత్రి పదవి కోసం కోయ దొరలతో పూజలు చేయించి సంచలనం సృష్టించారు.

తాజాగా చల్లా ధర్మారెడ్డి మరోసారి రాజకీయ తెర మీదకు వచ్చారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వరంగల్ పర్యటనలో చల్లా ధర్మారెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల సందర్శన కోసం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావుతోపాటు ఎంపి సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆరూరి రమేశ్ తదితరులు వెళ్లారు.

అయితే ఈ హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చారు. కానీ అప్పటికే హెలిక్యాప్టర్ ఫుల్ కావడంతో ధర్మారెడ్డి ఒక్కడే వెనుదిరిగారు. మిగతావారంతా హెలిక్యాప్టర్ లో పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో డిప్యూటీ సిఎం కడియం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ధర్మన్న ఒక్కడే మిగిలిపోయిండా అని కామెంట్ చేశారు. వీడియో కింద చూడొచ్చు.