డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్...
హవాలా, మనీ లాండరింగ్ కేసులో డీసీ వెంకట్రామిరెడ్డి, అయ్నర్ని ఈడీ అరెస్ట్ చేసింది.
హైదరాబాద్ : డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి, అయ్నర్ని ఈడీ అరెస్ట్ చేసింది. హవాలా, మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరినీ ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో రుణాలు ఎగవేసిన ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో రూ. 3,300 కోట్లకుపైగా ఆయన మీద ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. పెద్ద మొత్తంలో రుణాలు దారి మళ్లించినట్లు అభియోగాలు ఆయన మీద ఉన్నాయి. డీసీ వెంకట్రామిరెడ్డి పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకున్నారు. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది.
తీసుకున్న రుణాలు సొంతానికి వాడుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. మంగళవారం డీసీ వెంకట్రామిరెడ్డితో పాటు గతంలో సీఈఓగా పనిచేసిన మణి అయ్యర్ని కూడా పిలిచి విచారించారు. వీరితో పాటు మరో వ్యక్తిని కూడా పిలిచారు. ఈ ముగ్గురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. రిమాండ్ కు పంపిస్తారు.దీనికి సంబంధించిన మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.