Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో అప్పులు పెరగలేదు: కేసీఆర్

రాష్ట్రంలో అప్పులు పెరగలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. 
 

Debts in the state did not increase: KCR lns
Author
Hyderabad, First Published Mar 26, 2021, 2:53 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో అప్పులు పెరగలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్  శుక్రవారం నాడు ప్రసంగించారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి లోబడే అప్పులు తీసుకొన్నామని ఆయన ప్రకటించారు. 

ఆర్ధిక క్రమశిక్షణ పాటించిన రెండు మూడురాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన చెప్పారు. పార్లమెంట్ కు కేంద్రం సమర్పించిన నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో వైపు ఆర్బీఐ నివేదికను కూడ ఆయన గుర్తు చేశారు.చాలా తక్కువ అప్పులు తెచ్చిన రాష్ట్రం తెలంగాణదేనని ఆయన చెప్పారు. 

also read:తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు: తేల్చేసిన కేసీఆర్

వేసవిలో ఏనాడూ కూడ 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ ఎకరాల్లో పంటను వేయలేదన్నారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 60 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగు చేస్తున్నారని ఆయన చెప్పారు.ఇందులో 52 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారని ఆయన వివరించారు.కోటి 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు.రాష్ట్రంలో తాగునీటి సమస్యకు చెక్ పెట్టామన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కూడ ఇదే విషయాన్ని చెప్పిందన్నారు.

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆయన విపక్షాలపై మండిపడ్డారు. కేసులను అధిగమిస్తూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టామన్నారు.వ్యవసాయ ఉత్పత్తుల అదనంగా పెంచామన్నారు. వంద శాతం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.అన్ని రంగాల్లో పెరుగుదల సాధించినట్టుగా కేసీఆర్ వివరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios