ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా మృతదేహాలు తారుమారయ్యాయి. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత విషయం వెలుగులోకి రావడంతో ఇరు కుటుంబాల వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఉస్మానియా మార్చురీలో (osmania hospital mortuary) దారుణం జరిగింది. సిబ్బంది మృతదేహాలను తారుమారు చేసిన ఘటన (dead bodies change) కలకలం రేపుతోంది. ఒకరి మృతదేహం బదులు మరో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మైలార్‌దేవ్‌పల్లి (mylardevpally) ఎస్ఆర్ నగర్‌లో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే మైలార్‌దేవ్ పల్లికే చెందిన పాండు రంగాచారి మృతదేహాన్ని ఎస్ఆర్ నగర్‌లోని కుటుంబానికి అప్పగించారు సిబ్బంది.
దీంతో వివాదం చెలరేగింది. ఈలోగా మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించింది మైలార్‌దేవ్‌పల్లిలోని మరో కుటుంబం. చనిపోయిన పాండురంగాచారి మృతదేహం కోసం మార్చురీకి వెళ్లిన కుటుంబ సభ్యులు మృతదేహం కనిపించకపోవడంతో ఆరా తీశారు. దీంతో మృతదేహం తారుమారైనట్లుగా గుర్తించారు ఉస్మానియా సిబ్బంది. అంత్యక్రియలు చేసిన మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
