Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ కేసు .. 3 కోట్లే టార్గెట్ , ఒక్కోక్కరితో రూ.30 లక్షల డీల్ : డీఈ రిమాండ్ రిపోర్ట్‌లో ముఖ్యాంశాలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఇటీవల అరెస్ట్ చేసిన డీఈ రమేశ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించారు సిట్ అధికారులు. అలాగే రమేశ్‌కు సహకరించిన వారి కోసం సిట్ ఆరా తీస్తోంది. 

DE ramesh remand report reveals key information about tspsc paper leak case ksp
Author
First Published May 31, 2023, 7:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి రోజుకోక కీలక విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా డీఈ రమేశ్ అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది . 3 పేపర్లు లీక్ చేసి రూ.10 కోట్లు సంపాదించాలని ఇతను స్కెచ్ గీసినట్లు సిట్ పేర్కొంది. ఏఈతో పాటు డీఏవో పేపర్లను లీక్ చేశాడు రమేష్. ఇందుకుగాను ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.20 నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే 30 నుంచి 50 మంది అభ్యర్ధులతో ఈ డీల్ మాట్లాడినట్లుగా సిట్ పేర్కొంది. 

అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశాడని తెలిపింది. పరీక్ష సెంటర్ల ఇన్విజిలేటర్స్‌ను ట్రాప్ చేశాడని.. ఇందుకుగాను వారికి ముందుగానే డబ్బులు చెల్లించాలని పేర్కొంది. దీంతో పరీక్ష పేపర్ ఇచ్చిన 5 నిమిషాలకే రమేష్ వద్దకు పేపర్ చేరిందని సిట్ వెల్లడించింది. అనంతరం చాట్ జీపీటీ ద్వారా జవాబులు తెలుసుకుని అభ్యర్థులకు చేరవేశాడని తెలిపింది. అంతేకాదు.. పేపర్ల లీక్ కోసం డీఈ రమేష్ ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు పేర్కొంది. పెద్దపల్లిలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఇతను డీఈగా  పనిచేస్తున్నాడని తెలిపింది. ఇప్పటికే భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. అలాగే రమేశ్‌కు సహకరించిన వారి కోసం సిట్ ఆరా తీస్తోంది. 

ALso Read: పేపర్ లీక్ కేసు : ఆ 37 మంది డీబార్.. టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం

ఇదిలావుండగా.. పేపర్ లీక్ కేసుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. అరెస్ట్ అయిన 37 మందిని డీబార్ చేయాలని నిర్ణయించింది. వారు భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డీబార్ చేయాలని డిసైడ్ అయ్యింది. అభ్యంతరాలుంటే 2 రోజుల్లో రిప్లయ్ ఇవ్వాలని సదరు 37 మందికి నోటీసుల్లో తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios