కొడుకుతో సమానంగా చూడాల్సిన అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కడుపున పుట్టిన కన్నకూతురి జీవితాన్ని, సంసారాన్ని నాశనం చేసింది. నిజం తెలుసుకున్న కూతురు తల్లిపై పగ తీర్చుకుంది. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నల్గొడ రూరల్ మండలం అప్పాజీపేటకు చెందిన కల్లూరి సత్యమ్మ(55) కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లను తనే పెంచి పెద్ద చేసింది. పెద్ద కూతురికి పెళ్లి చేసి పంపించేసింది. కాగా.. ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన రెండో కూతురు ఉంది. 

ఆ విషయం మర్చిపోయి యాదయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. యాదయ్యకు ఆస్తి బాగా ఉండటంతో..ఆమెకు ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు. డబ్బు పై ఆమెకు ఆశ పెరిగిపోయింది. తను ఏ వ్యక్తితో అయితే వివాహతేర సంబంధం పెట్టుకుందో అతని వద్దకే తన రెండో కూతురు రుద్రమ్మను పంపడం మొదలుపెట్టింది.

యాదయ్య కారణంగా రుద్రమ్మ రెండు సార్లు గర్భందాల్చింది. త్యమ్మ ఆమెకు అబార్షన్ చేయించి యాదయ్యకిచ్చి పెళ్లి చేసింది. ఏడాదికే వారికి ఓ పాప పుట్టింది. అయితే... యాదయ్యకు కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా అతనితో సత్యమ్మ వివాహేతర సంబంధం కొనసాగించడం గమనార్హం.

ఈ కారణంలోనే తల్లీకూతుళ్లకు గొడవలు జరుగుతున్నాయి. దీంతో రుద్రమ్మ భర్తకు, తల్లికి దూరంగా చౌటుప్పల్‌లో పాపతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. దీంతో అత్తాఅల్లుడు మరింత రెచ్చిపోయి తమ బంధాన్ని కొనసాగించేవారు. దీనికి తోడు తల్లి ప్రవర్తన నచ్చక పెద్ద కుమార్తె ఆండాళ్లు కూడా ఆమెతో మూడేళ్లుగా మాట్లాడటం లేదు. తల్లి కారణంగా తమ జీవితాలు నాశనమయ్యాయని భావించిన అక్కాచెల్లెళ్లు ఆమెను చంపేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో తల్లిని చంపేందుకు సఫారీ కుదర్చుకున్నారు. పథకం ప్రకారం ఓ వ్యక్తికి రూ.20వేలు ఇచ్చి తమ జీవితాలను నాశనం చేసిన తల్లిని చంపించారు. ఆమెను చంపేసి ఇంట్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలతో కూతిళ్లద్దరూ పరారయ్యారు. పోలీసులు ఈ కేసులోకి రంగ ప్రవేశం చేయడంతో.. తాము చేసిన నేరాన్ని ఇద్దరు కూతుళ్లు అంగీకరించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.