జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ కారు నానా భీభత్సం సృష్టించింది. బైపాస్ రోడ్డులోని దేవిశ్రీ గార్డెన్ వద్ద మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పిన డివైడర్ ని ఢీకొట్టి బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత మూడు ఫల్టీలు కొట్టి మరీ కారు బోల్తా పడిందంటే ఎంత స్పీడులో వుందో అర్ధం చేసుకోవచ్చు. 

ఈ ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సిసి టివి వీడియోను ఆధారంగా ఈ ప్రమాదం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. జగిత్యాల నుంచి రాజీవ్ బై పాస్ మీదుగా గొల్లపల్లి రోడ్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

వీడియో

"

ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులున్న అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును  పక్కకు తీయించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను గుర్తించేపనిలో పడ్డారు. ప్రత్యక్షసాక్షులు, సిసి కెమెరా పుటేజీ మాత్రం ఓవర్ స్పీడే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టం చేస్తున్నాయి.